ఉప ఎన్నికల కోసం ప‌రిశీల‌కుల నియామ‌కం

ప్ర‌క‌టించిన భార‌త ఎన్నిక‌ల సంఘం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేర‌కు అధికారికంగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి ఎన్నికల సంఘం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది . ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ (ఖ‌ర్చు ) పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ లను నియమించింది.

ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పర్యవేక్షిస్తారు . ఈ పరిశీలకులు ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను ప‌రిశీలిస్తార‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు స‌మ‌ర్పిస్తార‌ని వెల్ల‌డించింది ఎన్నిక‌ల సంఘం. కాగా ఉప ఎన్నిక పూర్తి అయ్యేంత వరకూ వీరు అందుబాటులో ఉంటారని స్ప‌ష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లు, శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియ చేయాల‌ని కోరింది.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *