సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ రావు

Spread the love

ల‌క్ష ఇళ్లు కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష ఇళ్లు క‌ట్టిస్తే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ల‌క్ష ఇళ్ల‌ను కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణ భ‌వ‌న్ లో వ‌డ్డెర సంఘం ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ . క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడ తీసుకొని తిట్టుకున్నారని ఆరోపించారు. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ఎలా ఆలోచిస్తార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదు. వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచు కోవడానికి సరిపోతోంద‌న్నారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే, హైడ్రా ఆగి పోవాలంటే కాంగ్ర‌స్ పార్టీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

ఎలక్షన్ ముంగట మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారు. రెండు వేల పెన్షన్ రూ. 4000 చేస్తామన్నారు, చేశారా కాంగ్రెస్ వాళ్ళు అని ప్ర‌శ్నించారు. రూ. 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ రూ. 2000 చేసిండని, రూ. 4000 పెన్షన్ ఇవ్వక పోయినా మహిళలకు రూ. 2500 ఇవ్వ‌క పోయినా నాకే ఓటేశారు అని రేవంత్ రెడ్డి అంటాడని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు హ‌రీశ్ రావు. మహిళలకు రూ. 2500 రావాలన్నా, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టి తీరాల‌ని, సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాల‌న్నారు. ఓటుతో రేవంత్ రెడ్డి చెంపలు వాయించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

  • Related Posts

    మోదీ బీజేపీ స‌ర్కార్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

    Spread the love

    Spread the loveపేద‌ల కడుపు కొట్టిన బీజేపీ ప్ర‌భుత్వంఅమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

    400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

    Spread the love

    Spread the loveజీహెచ్ ఎంసీ కాంపౌండ్‌నే పునాదిగా క‌బ్జా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండ‌లం చందాన‌గ‌ర్ ప‌రిధిలోని భ‌వానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. త‌మ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *