జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం

అన‌లిస్ట్ రాజశేఖ‌ర్ రావు చింతా ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : జ‌ల్లిక‌ట్టు త‌ర‌హాలో ఏపీలో భారీ ఉద్య‌మం రానుంద‌ని పేర్కొన్నారు పొలిటిక‌ల్ అన‌లిస్ట్ రాజ‌శేఖ‌ర్ రావు చింతా. శ‌నివారం ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా అమ‌రావ‌తి పేరుతో మోసం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చోటు చేసుకున్న అవినీతిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. ఇప్ప‌టికే గుంటూరు జిల్లా నుండి ఎన్. రాజశేఖర రెడ్డి, ఏ.వెంకటరెడ్డి, పీ. వీరారెడ్డి, ఎల్. శివారెడ్డితో పాటు ప్రకాశం జిల్లా నుండిఎం రాజశేఖర రెడ్డితో పాటు వేలాది మంది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విన‌తిప‌త్రాలు పంపించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రతీ పౌరుడు బాధ్యతతో ఈ కార్యాచరణలో భాగస్వామి కావాల‌ని పిలుపునిచ్చారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ ఏపీ కూట‌మి మ‌ద్ద‌తుతో న‌డుస్తోంద‌ని, దీంతో వీరు విచార‌ణ‌కు ఆదేశించ‌ర‌ని పేర్కొన్నారు.

ఏపీ ఖ‌జానా దోపిడీ నుంచి ర‌క్షించే బాధ్య‌త ఒక్క సీజేఐపైన ఉంద‌న్నారు రాజ‌శేఖ‌ర్ రావు చింతా. దీని వ‌ల్ల దోపిడీని అరిక‌ట్టేందుకు వీలు క‌లుగుతుంంద‌న్నారు. 4 కోట్ల ప్ర‌జ‌లు ఉన్న రాష్ట్రంలో కేవ‌లం 4 ల‌క్ష‌ల మంది విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పిస్తే పూర్తిగా న్యాయం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బ‌హిరంగ దోపిడీకి తెర తీశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందులో ల‌క్ష‌ల కోట్ల స్కాం జ‌రిగేందుకు ఆస్కారం ఉంద‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ వ్య‌వహారం గురించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తున్నామ‌న్నారు. ఒక నిర్భయ చట్టం, ఒక జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్ లో నిశభ్ద ఉద్యమం మొదలైందన్నారు.

అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినితిపై, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఎకరా 99 పైసలకే ప్రైవేటు సంస్థలకి తెగనమ్మే అంశాల పై సమగ్ర సీబీఐ విచారణ కి ఆదేశించాల‌ని కోరుతూ ఇప్ప‌టికే సీజేఐకి విన‌తి ప‌త్రాలు రాస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీల నాయకులు చేస్తున్న అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ చేపట్టడం లేద‌ని వాపోయారు. న్యాయం జ‌ర‌గాలంటే, దోపిడీ ఆగాలంటే కేవలం సీజేఐ ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. స్పీడ్ పోస్ట్ ద్వారా విన‌తి ప‌త్రాలు పంపించే ప్ర‌క్రియ ఊపందుకున్న‌ద‌ని పేర్కొన్నారు. ఈ కార్యాచరణ లో వాలంటీర్లు, యువత, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ఖజానా దోపిడీ అరికట్టాలని బాధ్యత తో పాల్గొంటున్నారని తెలిపారు. ఇక వినతి పత్రాల నమూనా కోసం dicsoochi@gmail.com కి ఈమెయిల్ పంపించాల‌ని కోరారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *