బాబును చూసి రేవంత్ నేర్చుకుంటే బెట‌ర్

బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని , తెలంగాణ‌ను మొంథా తుపాను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింద‌న్నారు. ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , మంత్రులంతా రంగంలోకి దిగార‌ని, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, పెద్ద ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అన్నారు. అయితే మొంథా తుఫాన్‌తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం పెళ్లిళ్లు, పేరంటాలు, సినీ తారలతో తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి.

తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయి రైతులు కష్టాల్లో ఉన్నా, వారిని పరామర్శించే సమయం కూడా రేవంత్‌కు లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్. ప‌క్క‌న ఉన్న సీఎం , త‌న గురువు నారా చంద్ర‌బాబు నాయుడును చూసి నేర్చు కోవాల‌ని హిత‌వు ప‌లికారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి.
విపత్తు సమయంలో ప్రజలతో పాటు నిలబడే నేతగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే, రేవంత్‌ మాత్రం ప్రదర్శన రాజకీయాల్లో మునిగి పోయారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల సీఎం నిర్లక్ష్య ధోరణి అంగీకార యోగ్యం కాదని ఏలేటి మండిపడ్డారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *