ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు
అమరావతి : అందరి సహకారంతో మొంథా తుపానును తట్టుకుని నిలబడటం జరిగిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సచివాలయంలో 137 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎవరూ ఊహించని విధంగా టెక్నాలజీని ఈసారి వాడడం జరిగిందన్నారు. ఎక్కువ నష్ట పోకుండా చూశామన్నారు. ఇందుకు మీ అందరి సహకారం మరిచి పోలేమన్నారు చంద్రబాబు నాయుడు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపించామని చెప్పారు. వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేయడం జరిగిందని అన్నారు సీఎం.. అతి పెద్ద తుఫాన్‌ను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశామన్నారు.
డ్రోన్ల ద్వారా తుఫానులో చిక్కకున్న వారి ప్రాణాలు కూడా కాపాడామన్నారు నారా చంద్రబాబు నాయుడు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని, ఓ ప్రార్ధనా మందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా రక్షించామన్నారు. అంతా కలిసి చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. 602 డ్రోన్లను కూడా ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఓ ఎస్ఓపీని తయారు చేసుకుని శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలెర్టులు పంపించామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ముందస్తు జాగ్రత్తగా కాలువల పూడికలు, అడ్డంకులు తొలగించాం. అందుకే భారీ వర్షాలు కురిసినా నీరు అంతా కిందికి సులువుగా ప్రవహించిందన్నారు.
తద్వారా వరద ముప్పు తగ్గింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్ర స్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారు. సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు అంతా బాగా పనిచేశారు. అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించాం. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్పూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రజలు కూడా ఈ స్పూర్తిని అంది పుచ్చుకోవాలి. వారి సహకారం కూడా ప్రభుత్వానికి అవసరమని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు






