ముఖ్య‌మంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ భేటీ

మార్క్ లామీ బృందం మ‌ర్యాద పూర్వ‌క మీటింగ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు
ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం స‌భ్యులు. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం . హైదరాబాద్ లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో మౌద్ మిక్వా, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా సీఎంను హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం కూడా కలిసింది. ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, తెలంగాణ రైజింగ్ – 2047 ప్రణాళిక గురించి వారికి వివరించారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లోనూ పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో శ కారెన్( karen), కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్( Ed Jäger), ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *