రెండు రోజుల పాటు తిరుపతిలోనే పవన్ మకాం
చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదలను మర్యాద పూర్వకంగా కలిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయన శనివారం , ఆదివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ మంగళం లోని అటవీశాఖ పరిధిలోని ఎర్ర చందనం గోడౌన్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రికి పూల గుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం తెలిపారు. అనంతరం చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలి మడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా అంతటా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ తుషార్ డూడి. ముఖ్యంగా మార్గమధ్యంలో పోలీసు పికెటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే, పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ ఎనిమిది గో డౌన్లను పరిశీలించారు. వెంటనే పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు.






