నిప్పులు చెరిగిన మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ ,అమిత్ షా కి గాంధీ పేరు పలికితే ఉలుకు కలుగుతుందన్నారు. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అన్నారు. గాడ్సే పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని ఆరోపించారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదురుకునే ధైర్యం మోదీ, అమిత్ షా కి లేదన్నారు. గాంధీ పేరు పలికితే ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ కనపడతారని అన్నారు. దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు చిరస్మరణీయంగా ఉండి పోతుందన్నారు.
అప్పటి ప్రధాని మనోహన్ సింగ్ తో మాట్లాడి జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారని చెప్పారు.
ప్రజలకి 100 రోజుల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెడుతూ వస్తోందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు అప్రజాస్వామికం అని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల్లో నుంచి చెరప లేరన్నారు.
భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని సంచలన ఆరోపణలు చేశారు. మనుస్మృతి అమలు చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసిన వెడమ బొజ్జు ఎమ్మెల్యే అయ్యారని అన్నారు.





