కబ్జాదారుల నుండి కాపాడాలని విన్నపం
హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి విలువైన స్థలాలను కాపాడలని హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం వారం ప్రజా వాణి నిర్వహిస్తోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో . తాజాగా నిర్వహించిన ప్రజా వాణికి 32 ఫిర్యాదులు అందాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం ఆర్‌కే పురం డివిజన్‌లోని గ్రీన్‌హిల్స్ కాలనీలో 6087 గజాల ఓపెన్‌స్పేస్ వదిలిపెట్టారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురయ్యిందని.. వెంటనే సర్వే జరిపించి రికార్డుల ప్రకారం ఉన్న భూమిని కాపాడాలని నివాసితులు కోరారు. అంతే కాకంఉడా తమ కాలనీకి మంచి పార్కును నిర్మించాలని విన్నవించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నిజాంపేట సర్కిల్ పరిధిలోని చిల్డ్రెన్ పార్కు దగ్గరలోని మురుగునీరు, వరదనీటి కాలువను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోయారు. గతంలో ఎలా ప్రవహించేదో అలాగే ఉంచాలని కౌశల్యా కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించారు. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలకు అనువుగా కాలువను తిప్పి వరద సాఫీగా సాగేందుకు అవకాశం లేకుండా మారుస్తున్నారని ఆరోపించారు. . వెంటనే కలుగ చేసుకుని గతంలో మాదిరి వరద సాగేలా చూడాలని కోరారు. ఐటీ హబ్‌కు చేరువలో అత్యంత విలువైన ఖాజాగూడలో ఉన్న ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని వెయ్యి గజాల వరకూ కబ్జా చేసేశారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. దీనిని 250 గజాల చొప్పున 4 ఫ్లాట్లుగా చేసి ఇంటి నంబర్లు కూడా తెచ్చుకున్నారని తెలిపారు. వెంటనే హైడ్రా రంగంలోకి దిగి ఖాజాగూడ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని రక్షించాలని కోరారు.






