నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని
అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ మోడల్ అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తమ హయాంలో పేదలకు మెరుగైన వైద్యం, పిల్లలు చదువుకునేందుకు మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చామన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు తమ వారికి కట్టబెట్టేందుకు ప్లాన్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని. విచిత్రం ఈ కాలేజీల విషయంలో చెబుతున్నవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే కిమ్స్ ఆస్పత్రిలో బాత్రూంలు కడిగే వాడితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని మండిపడ్డారు.
KIMS ఆసుపత్రి టెండర్ల విషయంలో టీడీపీ ఆడిన డ్రామాను బైట పెట్టారు పేర్ని నాని. దేశ వ్యాప్తంగా ఉన్న 26 KIMS ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేనే లేడన్నారు. ఈ విషయం తమ విచారణలో బయట పడిందన్నారు. ఎక్కడో ఒక దగ్గర బాత్రూములు కడిగే అతను ఉన్నాడని, అతని పేరు చివర షా కూడా లేదు, అదీ మీ భాగోతం అంటూ భగ్గుమన్నారు. చంద్రబాబు వంట మనుషులతో MOU చేసుకున్నాడు అని కేసీఆర్ అంటే ABN రాధాకృష్ణ తెగ పిసుక్కున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమైంది మరి బాత్రూములు కడిగే వాడితో టెండర్ వేయించలేదా అని నిప్పులు చెరిగారు పేర్ని నాని.
మా KIMS ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని KIMS సంస్థతో లేఖ విడుదల చేయిస్తే, తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెప్తానని ప్రకటించారు మాజీ మంత్రి.






