సోషల్ మీడియలో ముద్దుగుమ్మ వైరల్
హైదరాబాద్ : నటి, మోడల్, బిగ్ బాస్ బ్యూటీ దివ్య వైద్య సంచలనంగా మారారు. తను బీచ్ లో సందడి చేశారు. ఈ సందర్బంగా బికినీతో ఏకంగా రీల్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి సామాజిక మాధ్యమాలలో. ఇది పక్కన పెడితే సాంప్రదాయకంగా దుస్తులు ధరిస్తూ వచ్చిన దివి వైద్య ఈ మధ్యన రూటు మార్చేసింది. ఇక సినిమాలలో మరిన్ని ఛాన్సులు రావాలనే ఉద్దేశంతో అందాలను ఆరబోసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే బికినీలతో కూడిన డ్రెస్ లు వేసి కుర్రకారు గుండెలను గిలిగింతలు పెడుతోంది. ఇక దివి వైద్య గురించి చెప్పాల్సి వస్తే తను నటిగా, మోడల్ గా పేరు పొందింది.
దివి 2019లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా అత్యంత జనాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇక మీడియా పరంగా పేరు పొంది హైదరాబాద్ టైమ్స్ పత్రిక 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా ప్రకటించింది దివి వైద్యను. ఇక దివి వైద్య 1996 మార్చి 15లో హైదరాబాద్లో శశికాంత్ వైద్య, దేవకీ దంపతులకు జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.
దివి సినిమాల మీద మక్కువతో 2017లో మోడలింగ్‌తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆమె పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది. దివి 2018లో తొలిసారిగా “లెట్స్ గో” అనే లఘు చిత్రంలో నటించింది.
దివి 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలలో నటించింది.ఆమె నటించిన ‘సిలక ముక్కుదానా’ అనే మ్యూజిక్ వీడియో 3 జూలై 2021న విడుదలైంది.







