సంక్రాంతికి అంద‌రి సినిమాలు స‌క్సెస్ కావాలి

Spread the love

అభిమానులు ఆద‌రించాల‌ని కోరిన మెగాస్టార్

హైద‌రాబాద్ : తాను న‌టించిన సినిమాతో పాటు త‌న సోద‌రులు ర‌వితేజ‌, ప్ర‌భాస్, త‌దిత‌రులు న‌టించిన సినిమాల‌ను కూడా ఆద‌రించాల‌ని అభిమానుల‌ను కోరారు మెగాస్టార్ చిరంజీవి. హైద‌రాబాద్ లో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాను కీ రోల్ పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ద‌ర్శ‌కుడు రాఘవేంద్రరావు అనిల్ తో నేను సినిమా చేస్తే అది అదిరి పోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారని గుర్తు చేశారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారని చెప్పారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు .. ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయని తెలిపారు .

ఈ సినిమాని వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి… ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయి పోయారు.అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియక పోవచ్చు .అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను. అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ వచ్చారని ప్ర‌శంసించారు చిరంజీవి. తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయి పోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను.

ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగిందని చెప్పారు చిరంజీవి. అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్‌ విషయంలోనూ అనిల్‌ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడని అన్నారు. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్లో చేసాం. డేస్ పరంగా అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీయ గ‌లిగామ‌ని అన్నారు. అనుకున్న బడ్జెట్లో అనుకున్న రోజుల్లో సినిమా చేయగలగడం ఒక సినిమాకి మొదటి సక్సెస్.

  • Related Posts

    రాజా సాబ్ దెబ్బ‌కు పంపిణీదారుల‌కు భారీ లాస్

    Spread the love

    Spread the love50 శాతానికి పైగా తిరిగి చెల్లించాల‌ని కోరారు హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ ఆధ్వ‌ర్యంలో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ది రాజా సాబ్ . ఇందులో ప్ర‌భాస్ , మాళవిక మోహ‌న్, రిద్ది కుమారి, నిధి…

    ప‌వ‌ర్ స్టార్ తో పీపుల్స్ మీడియా మ‌రో చిత్రం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నిర్మాత విశ్వ ప్ర‌సాద్ హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌ముఖ నిర్మాత‌, పీపుల్స్ మీడియా సంస్థ చీఫ్ టీజీ విశ్వ ప్ర‌సాద్. బుధ‌వారం ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *