ఈసారి వరంగల్ కు ఎట్లా వస్తావో చూస్తా
వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ పై నోరు పారేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే స్థాయికి దిగజారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను టార్గెట్ చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. బిడ్డా మళ్లీ నువ్వు వరంగల్ కి వస్తే ఈసారి చెప్పులతో కొట్టిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం వదిలి పెట్టనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాయిని రాజేందర్ రెడ్డి. నిన్ను చెప్పులతో కొట్టి పంపించక పోతే నా పేరు మార్చుకుంటా నంటూ సవాల్ విసిరారు.
ఏం బతుకురా నీది? ఇంకెప్పుడు సిగ్గొస్తది? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే. బూతులు తిట్టడంలో మేమంతా పీహెచ్ డీ చేశామని అన్నారు. ఒకసారి తిట్టడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కడు ఉరేసుకుని చస్తారంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు నాయిని రాజేందర్ రడ్డి. తక్షణమే తమ అగ్ర నాయకుడు, అమేథి ఎంపీ రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకోసా నోరు పారేసుంటే తాట తీస్తామన్నారు ఎమ్మెల్యే.






