ఉర్దూ యూనివర్శిటీ లైబ్రరీ వద్ద ఆందోళన
హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన ఉర్దూ యూనివర్శిటీకి చెందిన ప్రభుత్వ భూములపై సర్కార్ కన్నేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ యూనివర్శిటీ భూములను కొట్టేయాలని చూశాడు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. చివరకు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అప్పటి చీఫ్ సెక్రటరీని జైలులో ఉంచాలని పేర్కొంది. దెబ్బకు మనోడు దిగి వచ్చాడు. అయినా సీఎం తీరు మారలేదు. ఏదో రకంగా సర్కార్ భూములను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో ఉర్దూ యూనివర్శిటీపై కన్నేశాడని విద్యార్థులు ఆరోపించారు. తమ జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం పట్ల మండిపడ్డారు.
ఈ సందర్భంగా సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రేవంత్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని.. యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీ చేపట్టారు.






