నిరంతర శిక్షణ వల్ల ఎంతో మేలు కలుగుతుంది
హైదరాబాద్ : యువ ఆపద మిత్రలు సేవలు అందించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. ఈ వారం పాటు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మందికి చేర వేయాలని యువకులను కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను అదనపు డైరెక్టర్ నివృత్తి చేశారు.
అంతే కాకుండా వారి అభిప్రాయాలను కూడా సేకరించారు. చెరువుల పునరుద్ధరణ, ప్రజా అవసరాల స్థలాలు, పార్కుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని విద్యార్థులు ప్రశంసించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ గౌరవ్, మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ గంట రాజేష్, హైడ్రా ఆర్ఎఫ్‌ఓ జయ ప్రకాశ్, డీపీవోలు యజ్ఞ నారాయణ, గౌతమ్, ఏడీఎఫ్‌వో మోహనరావు, ఇన్‌స్పెక్టర్ షంషుద్దీన్, ఎన్‌డీఎంఏ కన్సల్టెంట్ డా. గౌతమ్ తదితరులు పాల్గొని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు పలు సూచనలు చేశారు.






