నకిలీ ఐడీలతో 21 వేల సిమ్ కార్డులు
భారీ రాకెట్ ను ఛేదించిన సీబీఐ
న్యూఢిల్లీ : సైబర్ నేరాల భారీ రాకెట్‌లో టెలికాం ఇన్‌సైడర్‌ను సీబీఐ ఛేదించింది, నకిలీ ఐడీలతో జారీ చేసిన 21,000 సిమ్ కార్డులు జారీ చేసినట్లు గుర్తించింది. ఆపరేషన్ చక్ర-Vలో భాగంగా వ్యవస్థీకృత సైబర్ నేరాలకు దోహద పడ్డారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను అరెస్టు చేసింది. CBI ప్రకారం నకిలీ గుర్తింపులను ఉపయోగించి దాదాపు 21,000 సిమ్ కార్డులను సేకరించడంలో నిందితుడు కీలక పాత్ర పోషించాడు.
ఇది టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) మార్గ దర్శకాలను స్పష్టంగా ఉల్లంఘించింది. దేశ వ్యాప్తంగా అనుమానించని పౌరులను లక్ష్యంగా చేసుకుని బల్క్ ఫిషింగ్ సందేశాలను పంపడానికి చట్ట విరుద్ధంగా పొందిన సిమ్ కార్డులను ఉపయోగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ టెలికాం ఇన్‌సైడర్లు మరియు సైబర్ మోసం నెట్‌వర్క్‌ల మధ్య లోతైన సంబంధాన్ని బయటపెట్టిందని ఏజెన్సీ పేర్కొంది.






