స్పష్టం చేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డల సంక్షేమం కోసం పాటు పడతానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. తమ పార్టీ హై కమాండ్ తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టారని అన్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మేడం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా గతంలో ఇదే బాధ్యతలను బెలయ్య నాయక్ చేపట్టారు. ఆయన నుంచి ఇవాళ శంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని ప్రకటించారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే తనను కలవాలని కోరారు శంకర్ నాయక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రవీణ్ చక్రవర్తి ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్ లు.






