స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగానికి సంబంధించి మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు ఎ రేవంత్ రెడ్డి.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటి నిర్మాణాల తో పాటు వసతి సౌకర్యాలు కల్పించేందుకు గాను నిధులు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. అయితే ప్రతిపాదనలు వెంటనే తయారు చేసి పంపిస్తే పరిశీలించి ఆమోదం తెలియ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ ప్రయారిటీ విద్యా పరంగా నాణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి.






