ధన్యవాదాలు తెలిపిన సామినేని ఉదయ భాను
అమరావతి : ఏపీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పాలనా పరంగా ఆయన పట్టు సాధించారు. ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖా పరంగా కీలక మార్పులు తీసుకు వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్థంగా రహదారుల నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధానంగా రోడ్లు లేని గ్రామాలపై ఫోకస్ పెట్టారు. ఇందుకు గాను ఎవరు తన వద్దకు వచ్చినా వారికి భరోసా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా తక్షణమే తన శాఖ నుంచి నిధులను మంజూరు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు సామినేని ఉదయభాను
జిల్లాలో పలు పంచాయతీలలో అభివృధి కొరకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడిగిన పది గంటల్లోనే సుమారు 5 కోట్ల రూపాయల నిధులు పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించారు. ఈ సందర్బంగా తాము కోరిన వెంటనే స్పందించడమే కాకుండా నిధులు రిలీజ్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ కొణిదలకు ధన్యవాదాలు తెలిపారు సామినేని ఉదయ భాను.






