భారతీయ యువ ఇంజనీర్లు సత్తా చాటాలి
న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని టెక్నాలజీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్నది రేపు లేకుండా పోతోంది. ఈ తరుణంలో భారత దేశానికి చెందిన యువత మరింత దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు పీఎం. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. భారతీయ స్టార్టప్ ప్రపంచంలోని యువకులతో AI గురించి మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ఇది ఒక చిరస్మరణీయమైన, అంతర్దృష్టితో కూడిన సంభాషణగా ఆయన పేర్కొన్నారు.
దీనిలో వారు భారతదేశం AI ప్రపంచాన్ని ఎలా మారుస్తుందనే దానిపై వారి దృష్టి ,పనిని పంచుకున్నారని తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ స్టార్టప్‌లు ఇ-కామర్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్, మెటీరియల్ రీసెర్చ్, హెల్త్‌కేర్, మెడికల్ రీసెర్చ్, మరిన్ని వంటి విభిన్న రంగాలలో ఎలా పని చేస్తున్నాయో చూస్తే అబ్బురం అనిపిస్తుందన్నారు. రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే కంపెనీలలో ఇండియన్లు మరింతగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.






