అద్బుతమైన దర్శకురాలు అంటూ కితాబు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాన్యంగా ఎవరినీ మెచ్చుకోడు. అలా ఎవరినైనా ప్రశంసలు కురిపించాడంటే వాళ్లలో దమ్ముండాలి. అంతే కాదు తను ఇష్టపడే అంశాలు వారిలో అంతర్లీనంగా ఉండి ఉండాలి. తాజాగా ఇండియాను ఓ సినిమా షేక్ చేస్తోంది. ఆ చిత్రం పేరు టాక్సిక్. దీనికి దర్శకత్వం వహించింది ఎవరో టాప్ డైరెక్టర్ అనుకుంటే పొరపాటు పడినట్లే. కానే కాదు తను ఓ మహిళ. ఒకప్పుడు నటిగా నటించింది. పలు అవార్డులు గెలుచుకుంది. ఆమె ఎవరో కాదు మోస్ట్ పాపులర్ యాక్టర్ గీతూ మోహన్ దాస్. తన స్వస్థలం కేరళ. తను పలు సినిమాలకు స్వయంగా దర్శకత్వం వహించింది. వాటికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.
ఎవరూ ఊహించని విధంగా కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు యశ్ ను ఎంచుకుంది. తనతో భారీ బడ్జెట్ తో టాక్సిక్ పేరుతో మూవీ తీస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్ ను కోట్ల మంది వీక్షించారు. మేకింగ్, టేకింగ్ పూర్తిగా హాలీవుడ్ ను తలదన్నేలా ఉందని టాక్. అయితే మోతాదుకు మించి వయెలెన్స్ ఉందని పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేస్తున్నారు. వాటిని పట్టించుకునే స్థితిలో లేదు గీతూ మోహన్ దాస్. దీనిపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపల్ వర్మ . తను అద్భుతమైన దర్శకురాలంటూ కితాబు ఇచ్చాడు.







