ప్రకృతి వైద్య సలహాదారుడిగా బాధ్యతల స్వీకరణ
అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన మంతెన సత్యనారాయణ రాజు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్య నారాయణ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రఖ్యాత భారతీయ ప్రకృతి వైద్యుడు, యోగా నిపుణుడు . సహజ జీవనానికి న్యాయవాది, ఆహారం, వ్యాయామం, సాంప్రదాయ నివారణల ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన విస్తృత కృషికి ప్రసిద్ధి చెందారు,
ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆరోగ్యాలయం నడుపుతున్నారు. ఆయన ప్రతిరోజూ ఆరోగ్య సలహాలు, సూచనలు అందజేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా తను స్వంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. దీనిని లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా లక్షలాది మందికి చేరువయ్యారు మంతెన సత్య నారాయణ రాజు. ప్రకృతి వైద్యం, యోగా: ఆహార నియమాలు, నిర్దిష్ట వ్యాయామాలు (నడక వంటివి) , యోగ అభ్యాసాలపై దృష్టి సారించడం ద్వారా వ్యాధులను నయం చేయడానికి సహజ మార్గాలను సూచిస్తారు సత్యనారాయణ రాజు.






