స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్
విజయవాడ : యువత చేతుల్లోనే భారత దేశం భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ మారథాన్ నిర్వహించారు. అనంరతం మంత్రి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించి, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, విశ్వగురువుగా నిలబెట్టాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం అని చెప్పారు. స్వామి వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు సత్య కుమార్ యాదవ్.
వివేకానంద జయంతి సందర్భంగా యూత్ మారథాన్ నిర్వహించాం అన్నారు . ఆయన విలువల కోసం జీవించారో వాటిని అందరూ ఆదర్శంగా తీసుకుని పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయన చరిత్ర తెలుసుకొని ఆ విలువలను కొనసాగించాలని అన్నారు .వివేకానంద గురించి చెప్పేందుకే ఈరోజు యూత్ మారథాన్ నిర్వహించాం అని చెప్పారు. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆరోజుల్లోనే ప్రదర్శించిన మహనీయుడు వివేకానందుడని పేర్కొన్నారు. మన జాతి నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్ర గురించి వివేకానంద అనేక సందర్భాల్లో చెప్పేవారని గుర్తు చేశారు.






