చాన్నాళ్ల తర్వాత చిరంజీవికి దక్కిన విజయం
హైదరాబాద్ : చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి బిగ్ హిట్ దక్కింది తను తాజాగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు. గత కొంత కాలంగా తను నటించిన సినిమాలు ఆశించిన మేర సక్సెస్ కాలేక పోయాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అటు చిరంజీవిలో ఇటు ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది. చూస్తూ ఉండగానే 70 ఏళ్లకు చేరుకున్నారు. ఈ వయసులో కూడా తను యువ హీరోలకు తీసిపోని విధంగా సత్తా చాటాడు. దాదాపు కొన్నేళ్లు కావస్తోంది తనకు సరైన హిట్ లేకుండా. ఇక తెలుగు చలన చిత్ర పరిశమ్రలో మోస్ట్ ఫేవరబుల్, సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. తను గత ఏడాది వెంకీమామకు సూపర్ సక్సెస్ ఇచ్చాడు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మన శంకర వర ప్రసాద్ గారు మూవీ. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది . సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కన బెడితే ఫ్యాన్స్ ను సాధారణ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ చిత్రం. సంక్రాంతి సీజన్ లో ఎంటర్టైనర్ గా వచ్చి దుమ్మురేపుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో భారీ హిట్ కొట్టినట్లు పెద్ద ఎత్తున టాక్. అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో పాజిటివ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మొత్తంగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.







