అనిల్ రావిపూడిని అభినందించిన చిరంజీవి
హైదరాబాద్ : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటికే గణేష్, విక్టరీ వెంకటేష్ , తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాదు గారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున జనాదరణ పొందింది. చాన్నాళ్ల తర్వాత చిరంజీవికి బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు దర్శకుడు. దీంతో మెగా ఫ్యామిలీలో చెప్పలేని ఆనందం నెలకొంది. సినిమా బిగ్ సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడిని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఈ సందర్బంగా తనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమా నిర్మాణంలో తన కూతురు పాలుపంచుకుంది.
ఊహించని రీతిలో మన శంకర వర ప్రసాద్ గారు దుమ్ము రేపడంతో దర్శకుడు, నిర్మాతలు, నటీ నటులు ఖుష్ లో ఉన్నారు. తనకు హిట్ ఇచ్చినందుకు సంతోషంలో మునిగి పోయారు. ఈ సక్సెస్ కోసం మెగాస్టార్ ఎనిమిది సంవత్సరాలుగా వేచి చూస్తున్నాడు. చివరకు అనిల్ రావిపూడి రూపంలో తనకు విజయం దక్కడంతో చెప్పలేని సంతోషంలో మునిగి పోయాడు మెగా చిరంజీవి. మరో వైపు తను 70 ఏళ్లకు చేరుకుంటున్నాడు. ఈ వయసులో కూడా తను యువ హీరోలతో పోటీ పడి డ్యాన్సులతో హోరెత్తించడం విశేషం.







