సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా రాయబారి
న్యూఢిల్లీ : ఇండియా, అమెరికా దేశాల మధ్య చోటు చేసుకున్న సుంకం విధింపుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల నడుమ అమెరికా రాయబారి సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన భారత దేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కంటే ముఖ్యమైన దేశం మరోటి లేనే లేదని స్పష్టం చేశారు.
నిజమైన స్నేహితులు విభేదించవచ్చు, కానీ చివరికి వారి విభేదాలను ఎల్లప్పుడూ పరిష్కరించు కుంటారని ఆ నమ్మకం తమకు ఉందన్నారు . ఆయన ప్రత్యేకంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా భారతదేశంలో కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తను చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వాణిజ్య ఒప్పందాన్ని బలోపేతం చేయడంలో ఇరుపక్షాలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయని అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. కాబట్టి దీన్ని ముగింపు రేఖను దాటడం అంత తేలికైన పని కాదు, కానీ మేము అక్కడికి చేరుకోవాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టం చేశారు. మా సంబంధానికి వాణిజ్యం చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, శక్తి, సాంకేతికత, విద్య , ఆరోగ్యం వంటి ఇతర ముఖ్యమైన రంగాలపై తాము కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.






