సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వాహనదారులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున చలాన్లు వేయడం పట్ల ఆయన సీరియస్ గా తీసుకున్నారు.. ఈ మేరకు వారికి షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి చలాన్స్ వేయడంతో పాటు.. అదే మొత్తాన్ని సదరు వాహన దారుడు బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అయ్యేలా చూడాలన్నారు. ఆటో డెబిట్ విధానాన్ని తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ జరిమానాలకు రాయితీలు ఇవ్వడం వల్ల భయం లేకుండా పోయిందని.. అది సరికాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి.
ప్రమాదాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా చట్టం కూడా తీసుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వాహనదారుల గుండెల్లో గుబులు రేపేలా చేసింది. ఎక్కడ చూసినా వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని ఈ విషయం తనకు తెలుసని అన్నారు. ఒక్కసారి పెద్ద ఎత్తున వాహనదారుల ఖాతాల్లోంచి డబ్బులు కట్ అయితే తెలుస్తుందని, అప్పుడు గతి తప్పకుండా గీత దాటేందుకు ప్రయత్నం చేయరని స్పష్టం చేశారు. ఏదో అవసరమైతే తప్పా ఎవరికీ ఛాన్స్ ఇవ్వకూడదని పేర్కొన్నారు.






