తొలి రోజు రూ. 84 కోట్లు వసూలు చేసింది
హైదరాబాద్ : మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి . తను కన్న కలను నిజం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి , లవ్లీ బ్యూటీ నయనతార, విక్టరీ వెంకటేశ్, టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించారు మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం. ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కలెక్షన్ల పంట పండిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా తొలి రోజే ఈ మూవీ రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ డే రూ. 84 కోట్లకు పైగా వసూలు చేసింది మన శంకర వర ప్రసాదు గారు.
ఇదిలా ఉండగా భారతదేశంలో సుమారు రూ. 28.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి చిరంజీవి చిత్రం గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకు పోతోంది. ఈ ఏడాది పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ప్రభాస్ నటించిన రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆశించిన సక్సెస్ రాలేదు. నిరాశ పరిచాడు దర్శకుడు మారుతి. తనపై ట్రోల్స్ పెరిగాయి.
ఇదిలా ఉండగా రాజా సాబ్ తొలి, రెండు రోజులకు కలిపి కేవలం రూ. 63 కోట్లు మాత్రమే వసూలు చేయడం విస్తు పోయేలా చేసింది. తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఏ మాత్రం సినిమా సక్సెస్ కు దోహదం చేయలేదని టాలీవుడ్ కు చెందిన సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కథలో దమ్ము అనేది ఉంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని పేర్కొంటున్నారు. రాజా సాబ్ కోసం థమన్ ఇచ్చిన మ్యూజిక్ పని చేయలేదని, ఇదే సమయంలో భీమ్స్ సిసిరిలియో మన శంకర వర ప్రసాదు గారు కోసం ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్ కు బిగ్ ప్లస్ పాయింట్ అయ్యింది.







