సంక్రాంతి వేళ పుట్టిన గడ్డకు చేరుకున్నారు
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సందడి చేసింది స్వంత ఊరు నారా వారి పల్లెలో. చంద్రబాబుతో పాటు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ తో పాటు మనుమడు కూడా తమ ఊరికి చేరుకున్నారు. సంక్రాంతి పర్వదినం వేళ.. పుట్టిన గడ్డపై మమకారంతో, తన సొంత గ్రామం నారావారి పల్లెకు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం కుటుంబీకులకు పెద్ద ఎత్తున గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పేరు పేరునా పలకరించారు ప్రతి ఒక్కరినీ.
ఇదిలా ఉండగా నారా వారి పల్లెకు చేరుకున్న సీఎం కుటుంబీకులను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు కలుసుకుంటున్నారు . ముఖ్యమంత్రిగా కొలువు తీరాక ఈసారి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే తన ఊరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. సీఎం ఊరు కావడంతో నారా వారి పల్లెను పెద్ద ఎత్తున అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.






