నవీన్, చాందిని అనగనగా ఒక రోజు సూపర్
హైదరాబాద్ : నేచురల్ హీరో నవీన్ పోలిశెట్టి, లవ్లీ బ్యూటీ చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం అనగనగా ఒక రోజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా కామెడీని పండించాడు దర్శకుడు. ఇంటిల్లి పాదిని అలరించేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీనిని అందరూ హాయిగా చూసేలా తీశాడు. నవీన్ పోలిశెట్టి తన విలక్షణమైన పంచ్‌లైన్‌లు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను పూర్తిగా తన భుజాలపై నడిపించాడు నవీన్ పోలిశెట్టి. మొదటి ఇరవై నిమిషాలు రొటీన్‌గా అనిపిస్తాయి, అంతే కాకుండా కథ కూడా మొదట్లో పరిచితంగానే ఉంటుంది. సుమారు ముప్పై నిమిషాల తర్వాత,నవీన్ లయలోకి వచ్చి ప్రీ క్లైమాక్స్ వరకు ఆ ఊపును కొనసాగించాడు. రెండవ భాగంలో అతను రాజకీయ కథాంశం ద్వారా కొద్దిగా సామాజిక స్పృహను మేళవించాడు. క్లైమాక్స్ భావోద్వేగ భరితంగా ఉంది.
మీనాక్షి చౌదరి చారులత పాత్రలో చాలా బాగా నటించింది. మూడు పాటలు తెరపై బాగా ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా, అనగనగా ఒక రాజు ఈ సంక్రాంతికి యూత్ కింగ్ గా ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘అనగనగా ఒక రాజు’ మొదటి భాగం నవీన్ పోలిశెట్టి వన్-మ్యాన్ కామెడీ షోగా నడిపించాడు. హీరోగా, సంభాషణల రచయితగా, అతని పని కొన్ని సన్నివేశాలలో ఆకట్టుకుంటుంది. కథ పరంగా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు ఇది పాత కథే, ఒక ధనిక అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే కథ.







