కావాలని రాజా సాబ్ ను లక్ష్యంగా చేసుకున్నారు
హైదరాబాద్ : విలక్షణ దర్శకుడు మారుతి తీసిన తాజా చిత్రం ది రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల భామలు మాళవికా మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషించారు. ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో అధినేతలు టీజీ విశ్వ ప్రసాద్, కూతురు కీర్తి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో దీనిని తీశారు. అయినా ఊహించని రీతిలో మిశ్రమ స్పందన రావడం, ప్రత్యేకించి ట్రోల్స్ కు గురి కావడం పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తడంతో కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు దర్శకుడు మారుతి.
ఇదిలా ఉండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై నుంచి సంచలన ప్రకటన చేశాడు మారుతి. సినిమా నచ్చక పోతే తన ఇంటికి రావాలని చివరకు బహిరంగంగానే అడ్రస్ కూడా వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తనపై దాడి చేసేందుకు వెళ్లారు. సెక్యూరిటీ , వ్యక్తిగత సిబ్బందిపై కొందరు అభిమానులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు దర్శకుడు మారుతి. కొందరు కావాలని తమను లక్ష్యంగా చేసుకున్నారని, కానీ చివరకు తమ సినిమా రాజా సాబ్ తప్పకుండా సక్సెస్ అవుతుందని, పెట్టిన డబ్బులు తిరిగి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు .







