సంక్రాంతికి వేళ మెగాస్టార్ ఆనంద హేళ
హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటీ క్వీన్ నయనతార, విక్టరీ వెంకటేశ్, టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఎక్కడ చూసినా చిరంజీవి చేసిన హూక్ స్టెప్స్ తో దుమ్ము రేపుతోంది ఈ మూవీ. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కడుపుబ్బా నవ్వించే కామెడీ, ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేలా వినోదం పండించడంలో దర్శకుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు మరోసారి. ఇక తొలి రోజు రూ .84 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ట్రేడ్ టాక్ ప్రకారం రూ. 150 కోట్లకు దగ్గరగా ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా రూ. 130 కోట్లు రావాల్సి ఉందని సినీ వర్గాల నుంచి అందిన సమాచారం.
ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు రూ. 50 కోట్లు వసూలు చేసిందని, రాబోయే రోజుల్లో మరికొన్ని కోట్లు వసూళ్ల పరంగా సాధించే ఛాన్స్ ఉందని నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. ఇక .మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి తన తాజా చిత్రంతో అద్భుతంగా తిరిగి వచ్చారు, మొత్తం వసూళ్లకు స్థిరంగా జోడిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని పంపిణీదారులకు పెద్ద విజేతగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడితో మెగాస్టార్ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యిందంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. వారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దీనికి కారణంగా పెద్ద ఎత్తున వసూళ్లు సాధించడమే. పాత జ్ఞాపకాలు , ఎప్పటికీ నిలిచి పోయే పాటలతో నిండిన ఈ కుటుంబ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.







