సంచలన ప్రకటన చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కీలక ప్రకటన చేశారు ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా సంస్థ చీఫ్ టీజీ విశ్వ ప్రసాద్. బుధవారం ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సినిమా రంగానికి సంబంధించి పలు అంశాలు చర్చించారు. ఈ ఇద్దరూ కలిసి గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపుల్స్ మీడియా పలు సినిమాలను నిర్మిస్తోంది. నిర్మాతకు అమెరికాలో ఐటీ కంపెనీ ఉంది. కానీ ఆయనకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. అదే తనను నిర్మాతగా మారేలా చేసింది. హరీష్ శంకర్ తో కలిసి మిస్టర్ బచ్చన్ తీసిన మూవీ ఆశించిన మేర ఆడలేదు. ఇదే సమయంలో భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో కలిసి తీసిన రాజా సాబ్ వర్కవుట్ కాలేదు.
ఇదే సమయంలో టీజీ విశ్వ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో గతంలో ఓజీ మూవీ తీశారు. అది బిగ్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా నిర్మాత ఓ మీడియాతో మాట్లాడారు. తాను ఫెయిల్ , సక్సెస్ గురించి ఆలోచించనని అన్నారు. తనకు లెక్కకు మించిన ఆదాయం వస్తుందని, తనకు భారీ ఎత్తున కంపెనీ ఉందన్నారు. తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా కీలక ప్రకటన చేయడం ఆనందంగా ఉందన్నారు టీజీ విశ్వ ప్రసాద్. పీపుల్స్ మీడియాతో పవన్ కళ్యాణ్ కు విడదీయలేని అనుబంధం ఉందన్నారు . త్వరలోనే మరో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు నిర్మాత.







