కేక్ కట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. కొత్త సంవత్సరం 2026లో ఆయనకు కలిసి వచ్చింది. తాజాగా మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న అంచనాలు తలకిందులు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మూడు రోజుల్లో రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 84 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ. 40 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో సినిమా సక్సెస్ కావడంతో కేక్ కట్ చేశారు. ఇందులో చిరంజీవి, వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు చిరంజీవి కూతురు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తనకు బిగ్ హిట్ గా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు మెగాస్టార్. మరో వైపు విక్టరీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పని చేయడం ఎప్పటికీ మరిచి పోలేమన్నారు. తనకు మరోసారి మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు . ఇదే క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో తన తండ్రికి బ్లాక్ బస్టర్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపింది కూతురు.







