శ్రీకాకుళంలోని స్వగృహంలో సందడి
శ్రీకాకుళం జిల్లా : ఏపీలో సంక్రాంతి శోభ సందడి నెలకొంది. పండుగ వేళ సంబురాలు మిన్నంటాయి. ప్రజలు ఆనందంగా ఫెస్టివల్ ను జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వంత ఊరు నారా వారి పల్లెలో సందడి చేశారు. తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కొడుకు లోకేష్ తో పాటు మనవడు తో పతంగుల కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో వైపు మంత్రులంతా తమ తమ స్వంత ఊర్లలో, నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమై పతంగుల ఎగురవేత కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇదిలా ఉండగా బుధవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, భార్య, పిల్లలతో కలిసి భోగి పండుగను ఘనంగా తన స్వంత ఊరు శ్రీకాకుళంలో జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఏపీ వాసులకు, తెలుగు వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ, మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, చెడు అంతా భోగి మంటల్లో భస్మమై, కొత్త ఆశలతో నూతన ఆరంభాలకు ఈ భోగి పండుగ నాంది కావాలని, ప్రతి కుటుంబానికి సుఖ శాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు.






