50 శాతానికి పైగా తిరిగి చెల్లించాలని కోరారు
హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ . ఇందులో ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్ది కుమారి, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఆశించిన మేర ఆడలేదు. ఇదిలా ఉండగా సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఎత్తున ప్రభాస్ ను నమ్ముకుని, స్టార్ ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనప్పటికీ ఆశించిన మేర ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాదాపు 50 శాతానికి పైగా నష్టం వాటిచ్చిందని పంపిణీదారులు భగ్గుమంటున్నారు. తాము కోల్పోయిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో దర్శకుడు మారుతిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.
ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు. నిర్మాతకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కావాలని తలా తోకా లేకుండా ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ ఆరోపించారు. తనపై దాడి చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై దర్శకుడు మారుతి స్పందించారు. తను తీసిన సినిమాపై పూర్తి నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశాడు. రాజా సాబ్ తప్పకుండా సక్సెస్ అవుతుందని పేర్కొన్నాడు. అయితే ప్రభాస్ మాత్రం ఇందుకు సంబంధించి స్పందించలేదు. తను పూర్తిగా ఎవరికీ నష్టం కలిగినా తట్టుకోలేడు. పంపిణీదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే నిర్మాతలను ఆదేశించాడు.







