అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా
ఇరాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్షలు ప్రకటించడంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కలకలం రేపింది. దీంతో ఇరాన్ గగతలం మీద ప్రయాణం చేసే పలు దేశాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఎయిర్ ఇండియా తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమెరికాతో ఉద్రిక్తతల కారణంగా తమ గగన తలాన్ని (ఎయిర్ స్పేస్ ) ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు తాము ఏమీ చేయలేమని ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉండగా అమెరికాతో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండటంతో తమ ఎయిర్ స్పేస్ నుంచి విమానాలు వెళ్లేందుకు వీలు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఇరాన్ సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో
అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇరాన్ చుట్టూ ఉత్తరం, దక్షిణం వైపు మళ్లించాయి, కానీ ఒక పొడిగింపు తర్వాత, మూసివేత గడువు ముగిసినట్లు కనిపించింది. అనేక దేశీయ విమానాలు ఉదయం 7 గంటల తర్వాత గాలిలో ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజామున నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇరాన్ తన గగన తలాన్ని మూసి వేసింది.





