విచారణకు సహకరించక పోతే అరెస్ట్ తప్పదు
హైదరాబాద్ : చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఎన్టీవీ ఛానల్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానల్స్ లో నల్లగొండ జిల్లాకు చెందిన రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఓ ఐఏఎస్ మహిళా ఆఫీసర్ తో లింకు ఉందంటూ ప్రసారం చేయడం, విశ్లేషణలతో కూడిన కథనాలు ప్రసారం కావడం పట్ల సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇదే సమయంలో ఏకంగా సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ మేరకు సిట్ దర్యాప్తునకుఆదేశిస్తున్నామని, ఇది సజ్జనార్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సరే చట్టం ప్రకారమే విచారణ చేస్తారని అన్నారు. ఇదిలా ఉండగా సజ్జనార్ దూకుడు పెంచారు. మహిళా ఐఏఎస్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సమాజానికి మేలు చేకూర్చేలా మీడియా వ్యవహరించాలని కానీ ఉన్నత వర్గాలను, ప్రముఖులను భయ భ్రాంతులకు గురి చేసేలా , వ్యక్తిగత హనానికి దారి తీసేలా ఇలాంటి నీతి మాలిన, ఆధారాలు లేకుండా ప్రసారాలు చేస్తారంటూ నిప్పులు చెరిగారు సీపీ సజ్జనార్.





