ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తున్నారు కమిసనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్బంగా పతంగుల పండుగలో ఆయన పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 14 చెరువులను తీర్చిదిద్దుతామని చెప్పారు. హైడ్రా మొదటి విడత 6 చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని అన్నారు. మరో 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వీటికి తోడు మరో 14 చెరువుల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని వెల్లడించారు రంగనాథ్. త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇలా నగరంలో 100 చెరువులు అభివృద్ధి జరిగితే చాలావరకు వరదలను నియంత్రించవచ్చు అని అన్నారు.
మురికి కూపాలుగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చుతున్నామని చెప్పారు ఏవీ రంగనాథ్. దీంతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మంచి నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. మొత్తమ్మీద చెరువులు వేడుకలకు వేదికలవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చెరువును ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తారని తాము ఊహించలేదని పేర్కొన్నారు కమిషనర్. ఇప్పుడు చూస్తే ఎంతో సంతృప్తిగా ఉందని అక్కడి నివాసితులు చెప్పడం సంతోషం కలిగిస్తోందన్నారు. దుర్గంధ భరితమైన వాతావరణాన్ని తొలగించి ఆహ్లాదాన్ని నింపిన హైద్రాకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వాకింగ్ ద్వారా మా ఆరోగ్యాలను మెరుగు చేసుకుంటున్నామని చెప్పారు. చిన్నపిల్లలు అందరూ కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు, స్థానికులకు హైడ్రా కమిషనర్ మిఠాయిలు పంచారు.





