ధ్రువీకరించిన నాసా..ఒక మహిళగా రికార్డ్
ఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్ తన విధుల నుంచి పదవీ విరమణ చేశారు. తను గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందించారు. అంతే కాదు అరుదైన ఘనతను సాధించారు. ఏకంగా 27 ఏళ్ల పాటు తను నాసా (అంతరిక్ష కేంద్రం) లో పని చేశారు. విశిష్ట సేవలు అందించారు. తను మాజీ నేవీ కెప్టెన్ గా ఉన్నారు. 60 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన అనంతరం తను గత ఏడాది డిసెంబర్ లో నా సా నుంచి వినమ్రంగా తప్పుకున్నారు. తన విధి నిర్వహణలో భాగంగా ఏకంగా మూడు రోదసీ స్టేషన్లలో 608 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు.
అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన సమయంగా రికార్డు సృష్టించింది, అరుదైన ఘనతను సాధించింది సునీతా విలియమ్స్. తొమ్మిది విహార యాత్రలలో 62 గంటలు పాటు ఉన్నది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సునీతా విలియమ్స్. నాసా నిర్వాహకుడైన జారెడ్ ఇసాక్ మాన్ సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మానవ అంతరిక్ష ప్రయాణంలో ట్రైల్ బ్లేజర్ అంటూ ప్రశంసలు కురిపించారు. మీ అర్హత కలిగిన పదవీ విరమణకు ప్రత్యేక అభినందనలంటూ పేర్కొన్నారు.





