ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈమేరకు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 11.25 గంటల నుండి రాత్రి 7 గంటల కు పైగా సిట్ విచారణ ఎదుర్కొన్నారు. రెండు రోజుల అనంతరం ఈ సిట్ చర్య తీసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తన దర్యాప్తును ముమ్మరం చేస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు నోటీసు జారీ చేసింది, శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని కోరింది. కాగా నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు. మరో వైపు సిట్ ను రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో విచారణ కమిటీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టింది.





