పేదల కడుపు కొట్టిన బీజేపీ ప్రభుత్వం
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది రాష్ట్రంలో. ఈ సందర్బంగా జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కావాలని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా జాతీయ ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర ఇవాళ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగింది. అమలాపురం నియోజక వర్గం లోని బట్నవెల్లి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మన్రేగా పథకం ద్వారా జరిగిన లబ్ధిని, మోడీ తెచ్చిన అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని వివరించారు షర్మిలా రెడ్డి. మన్రేగా పథకాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే కొత్త చట్టాన్ని రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగిస్తూ 100 రోజుల నుంచి 150 రోజులకు పని దినాలను పెంచుతామని ప్రకటించారు. వేతనాలను 400 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.





