పంతుల‌మ్మ‌గా మారిన బండారు శ్రావణి శ్రీ‌

Spread the love

జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ ఆక‌స్మిక త‌నిఖీ

అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ సంచ‌ల‌నంగా మారారు. త‌ను సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ వారి స‌మ‌స్య‌లు వింటూ ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు సంబంధిత శాఖాధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌లు తీరు ప‌ట్ల ఆరా తీస్తున్నారు. ఆపై ఎలా చివ‌రి వ‌ర‌కు అందుతున్నాయో కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రుగులు పెట్టిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ పంతుల‌మ్మ అవ‌తారం ఎత్తారు. పుట్లూరు మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత పరిశీలించి, ఇంకా మెరుగైన నాణ్యతతో ఆహారాన్ని అందించాలని సూచించారు. కోడిగుడ్డు సైజు ఇంకా పెద్దవి సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నీటికి సంబంధించిన ఆర్.ఓ. మరమ్మతులకు గురైందని, స్కూల్ వేళకు వచ్చేందుకు సకాలంలో బస్సులు రావడం లేదని, స్కూల్ కు గ్రౌండ్ కు ప్రహరిగోడ లేదని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

  • Related Posts

    సీఎస్ఆర్ నిధుల కోసం ప్ర‌త్యేక పాల‌సీ

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీపై ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility)…

    ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కు లుక్ అవుట్ జారీ

    Spread the love

    Spread the loveదుబాయ్ కి చెందిన సూత్ర‌ధారని నిర్దార‌ణ ఉత్త‌ర ప్ర‌దేశ్ : దుబాయ్‌కు చెందిన ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కోసం యూపీ ఏటీఎస్ ప్రపంచవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో ఇటీవల ఛేదించబడిన ఐసిస్ ఉగ్రవాద ముఠాకు సూత్రధారిగా అనుమానిస్తున్న,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *