త‌మిళ నాట గాడి త‌ప్పిన స్టాలిన్ పాల‌న

Spread the love

నిప్పులు చెరిగిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్

చెన్నై : రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా డీఎంకే పాల‌న మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న దూకుడు పెంచారు. విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. జ‌న సంద్రం మ‌ధ్య నిప్పులు చెరిగారు. త‌న‌ను కావాల‌ని కొంద‌రు అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. కానీ వారి కుట్ర‌లు, కుతంత్రాలు త‌న ముందు చెల్ల‌వ‌న్నారు. సినిమా రంగంలో అపార‌మైన అవ‌కాశాలు, లెక్క‌లేనంత రెమ్యున‌రేష‌న్ వ‌స్తున్నా తాను కాదనుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని అన్నారు.

కేవ‌లం త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని రక్షించ‌డం కోసం , ప్ర‌జ‌ల‌ను బాగు చేసేందుకే తాను కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని చెప్పారు టీవీకే విజ‌య్. తాను ఫీనిక్స్ లాంటి వాడిన‌ని , ఎంత‌గా ఇబ్బంది పెట్టినా తాను వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతూనే ఉంటాన‌ని అన్నారు. రాష్ట్రంలో డీఎంకే అరాచ‌క పాల‌న‌కు స్వ‌స్తి చెప్పాలంటే మీరంతా విలువైన ఓటు హ‌క్కు వినియోగించు కోవాల‌ని పిలుపునిచ్చారు . బీజేపీ, డీఎంకే పార్టీలు బ‌య‌ట‌కు తిట్టుకున్న‌ట్టు న‌టిస్తున్నాయ‌ని లోపాయికారిగా ఈ రెండు ఒక్క‌టేనంటూ ఆరోపించారు విజ‌య్.

  • Related Posts

    2027 మార్చి నాటికి రీ స‌ర్వే చేయాలి : సీఎం

    Spread the love

    Spread the love1.12 కోట్ల కొత్త ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు ఇవ్వాలి అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త…

    చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ఆస‌రాగా చేసుకుని ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లి ప‌రిస‌రాల్లో నాలుగైదు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *