రాయ‌ల‌సీమ‌పై మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ రెడ్డికి లేదు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. స‌విత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సాగు, తాగు నీరందించడానికి తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పులివెందుల నియోజక వర్గానికి 2014-19 మధ్య సీఎం చంద్రబాబు నాయుడు సాగు నీరందించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పులివెందులకు తాగు నీరందించడానికి రూ.480 కోట్ల జలజీవన్ మిషన్ నిధులతో మెగా వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే నెలలో ఈ నిర్మాణం పూర్తి కానుందన్నారు. ఈ వాటర్ గ్రిడ్ నిర్మాణంతో 24 గంటలూ పులివెందులకు తాగునీరు అందుతుందని తెలిపారు. పులివెందులకు సాగు, తాగు నీరు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత వెల్లడించారు.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. తన స్వార్థ రాజకీయాల గురించి తప్ప, సీమ అభివృద్ది గురించి జగన్ ఏనాడూ పట్టించు కోలేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు వెచ్చించారన్నారు. తరవాత అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం రూ.2,011 కోట్లే ఖర్చు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.6,600 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు ఎస్. స‌విత‌. ఇదే విషయం వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సైతం ఆ పార్టీ నాయకులకు వెల్లడించారన్నారు. రాయలసీమ అభివృద్ది గురించి జగన్ ఏనాడూ దృష్టి సారించలేదని ఆయన అన్నారన్నారు. రాయలసీమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యం గురించి ఆనాడు జగన్ ను ఎందుకు నిలదీయలేదని వైసీపీ నాయకులను మంత్రి సవిత ప్రశ్నించారు.

ఎల్ నినో సహా వైసీపీ లేవనెత్తిన సమస్యలపైనా అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్ ను ఆహ్వానించినా ముఖం చాటేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కావాల్సినంత సమయం మైక్ ఇస్తామని, వైసీపీ హయాంలో లాగా అగౌరపరచమని చెప్పినా అసెంబ్లీకి జగన్ రాలేదన్నారు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం జగన్ కే చెల్లిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులను స్పష్టం చేస్తున్నానని, రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత సవాల్ చేశారు.

  • Related Posts

    ప‌ర్యావ‌ర‌ణ ర‌హిత రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హితంగా మార్చేందుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ – గ్రీన్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో…

    క్వాంట‌మ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్ష‌ణ

    అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కు తీపిక‌బురు చెప్పింది కేంద్రం. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంట‌మ్ ఏఐ యూనివ‌ర్శిటీ క్యాంప‌స్ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా రానుంది. 8.25…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *