మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం జిల్లాలోని మెట్టూరు ఆనకట్ట నుండి ముఖ్యమంత్రి తిరు ఎస్. జోసెఫ్ విజయ్ గారు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పూలు, వరి విత్తనాలను కూడా చల్లారు. అనంత‌రం ఆయ‌క‌ట్టు ప్రాంత రైతుల‌తో ముచ్చ‌టించారు సీఎం. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల కోసం ఎన్ని ఇబ్బందులైనా ప‌డుతుంద‌ని , వారిని ఆదుకునే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు.

ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తాయ‌ని కానీ టీవీకే కూట‌మి స‌ర్కార్ అలాంటి వాటిని ప‌ట్టించుకోకుండా కామ్ గా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతుంద‌ని పేర్కొన్నారు. త‌మిళ‌నాడు ప్రాంత రైతాంగానికి ఇబ్బంది క‌లిగించేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నం చేసినా వారికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. త‌మ స‌ర్కార్ పూర్తిగా రైతు సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు తిరు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. రైతులు ఎవ‌రూ నీళ్లు లేవ‌ని ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. స‌మృద్దిగా సాగు కోసం నీళ్ల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని, పొదుపుగా నీటిని వాడు కోవాల‌ని సూచించారు సీఎం విజ‌య్ చంద్ర‌శేఖర్.

  • Related Posts

    రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్

    తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…

    ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ‌

    న్యూఢిల్లీ : ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ భూయాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడాన్ని నిరసించినందుకు ఆ యూనివర్సిటీ విద్యార్థుల నమోదును నిషేధించాలన్న బార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *