26 ప్రాజెక్టుల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

భారీ ఎత్తున ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ‌

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కీల‌క‌మైన ఎస్ఐపీబీ స‌మావేశం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో నూత‌నంగా చేప‌ట్ట‌బోయే 26 ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధంచిన ఆయా ప్రాంతాలు, ప్రాజెక్టులు, నిధులు, ఉపాధి అవ‌కాశాల వివ‌రాలు ఉన్నాయి.

  1. యాక్మే ఊర్జా ఒన్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌నుంది. ఇందులో సంస్థ‌ రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. దీని ద్వారా 1380 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

2.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు చేప‌ట్ట‌నుంది. ఇందులో రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. దీని ద్వారా 1,380 మందికి ఉపాధి ల‌భిస్తుంది.

3.చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌నుంది. మొత్తం రూ.12,905 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నుంది. 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

4.ఆంఫ్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టు రూ.15.10 కోట్లు పెట్టుబడి పెట్ట‌నుంది.

  1. రిలయన్స్ కన్సూమర్ ప్రోడక్స్ట్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో ఎఫ్ఎంసీజీలో రూ.758 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
  2. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.208 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది, 66 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

7.ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ రూ.201 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 436 మందికి ఉపాధి రానుంది.

8.ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.33 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది., 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

9.దస్పల్లా అమరావతి హోటల్స్ అమరావతిలో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 400 మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని తెలిపింది.

10.వీఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో రూ.55 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 98 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

11.శ్రీ వేంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీశైలంలో రూ.83 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 300 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

  1. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో రూ.117 కోట్ల పెట్టుబడి ఇన్వెస్ట్ చేయ‌నుంది. 300 మందికి జాబ్స్ వ‌స్తాయ‌ని తెలిపింది స‌ర్కార్.

13.. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్తవలసలో కన్వెన్షన్ సెంటర్ కు రూ.256 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది.

14.ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్ కాకినాడ లో రూ.87 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నుంది,

15.రైడన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.87,520 కోట్ల భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. ఇందులో పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

  1. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ ఇండియా విశాఖ కాపులుప్పాడ లో ఐటీ లాజిస్టిక్స్ రూ.140 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది, 2600 మందికి ఉపాధి ల‌భించ‌నుంది.
  2. శాన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ రూ.2600 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 800 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
  3. శ్రీ సిమెంట్ లిమిటెడ్, పలనాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ కోసం రూ.2260 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 350 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

19.రేమండ్, జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరో స్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ కింద‌ రూ.430 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 4,096 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

  1. రేమాండ్ జేకే మైనీ గ్లోబల్ ఎరోస్పేస్ లిమిటెడ్, అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్లు రూ.510 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. 1400 మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని స‌ర్కార్ తెలిపింది.
  2. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1200 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నుంది. 1400 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
  3. అలీప్ ఓర్వకల్లు వద్ద మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం రూ.36.25 కోట్ల పెట్టుబడి పెట్ట‌నున్నారు. 3000 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.
  4. అవంతీ వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖలో గుర్రమ్ పాలెంలో రూ.319 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది.

24.అస్సెల్ ఈఎస్ జీ కర్నూలు జిల్లా కృష్ణగిరిలో రూ.300 కోట్ల ఇన్వెస్ట్ చేయ‌నుంది. దీని ద్వారా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

  1. ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ మల్లవెల్లి లో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్
  2. జెఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ రూ.531 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. ఇందులో 45000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఇప్పటివరకు 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్లు పెట్టుబడులు వ‌చ్చాయని తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. 6.20 లక్షల ఉద్యోగ అవకాశాలు వ‌చ్చాయ‌న్నారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *