సీజేఐ గ‌వాయ్ స్పందించిన తీరు భేష్

Spread the love

ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ

హైద‌రాబాద్ : ఈ దేశంలో ద‌ళితులు, బ‌హుజ‌నులు ఉన్న‌త ప‌ద‌వుల‌లో నెల‌కొంటే త‌ట్టుకోలేక పోతున్నార‌ని, ఇందులో భాగంగానే దాడుల‌కు తెగ బ‌డుతున్నారంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ ని ల‌క్ష్యంగా చేసుకుని న్యాయ‌వాది రాకేష్ కిషోర్ బూటు విస‌ర‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంద‌కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పూర్తిగా ప్ర‌జాస్వామ్యంపై, భార‌త రాజ్యంగంపై జ‌రిగిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌పై బూటుతో దాడి చేయ‌డం ప‌ట్ల జ‌స్టిస్ గ‌వాయ్ స్పందించిన తీరు అత్యంత హుందాక‌రంగా, గౌర‌వనీయంగా ఉంద‌న్నారు. ఇలాంటి దాడులు త‌మ‌కు కొత్త కాదంటూనే కేసుల‌ను వాదించ‌డం ఆయ‌నకు చ‌ట్టం ప‌ట్ల‌, భార‌త ప్రజాస్వామ్యం ప‌ట్ల‌, రాజ్యాంగం ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను, నిబద్ద‌త‌ను తెలియ చేస్తుంద‌న్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదని ధ్వ‌జ‌మెత్తారు. అందుకే ఈ దాడికి తెగ పడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద జ‌రిగిన దాడి అని పేర్కొన్నారు మంద‌కృష్ణ మాదిగ‌.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *