కర్ణాటక సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు : కర్టాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచీ సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం స్పందించారు ట్రబుల్ షూటర్. ప్రభుత్వాన్ని తాము నడిపిస్తున్నా అంతిమంగా ఎవరిని పదవులు ఇవ్వాలో, ఎవరిని ఉంచాలో లేక తీసి వేయాలనేది తమ చేతుల్లో ఏమీ ఉండదన్నారు. అదంతా తమ పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ పుకార్లను కూడా ఆయన తోసిపుచ్చారు, మధ్యంతర ఊహాగానాల మధ్య నిర్ణయాలు పార్టీ నాయకత్వంపై ఆధారపడి ఉంటాయని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పార్టీ హైకమాండ్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం సిద్దరామయ్యతో పాటు తన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇప్పటికే రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో పెను మార్పులు ఉండ బోతున్నాయని ఆ పార్టీకి చెందిన సీనియర్లు, ఎమ్మెల్యేలు సైతం భావిస్తున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి బాంబు పేల్చారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇదంతా మీడియాలో వస్తున్న పుకార్లు తప్ప మరేమీ కావంటూ తోసిపుచ్చారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని అనుకుంటున్నారని, అలా అనుకోవడంలో, ఆశించడంలో తప్పు లేదన్నారు.






