INTERNATIONALNEWS

ధ‌నా ధ‌న్ తెలంగాణ పెవిలియ‌న్

Share it with your family & friends

దావోస్ లో ఆక‌ట్టుకున్న ఇన్నోవేష‌న్

దావోస్ – తెలంగాణ‌లో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. రాష్ట్రంలో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న 36 ల‌క్ష‌ల మందికి భ‌రోసా ఇచ్చేలా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఇందులో భాగంగా వ‌న‌రుల‌ను గుర్తించి స‌ద్వినియోగం చేసుకునేలా ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే సమ‌యంలో కాంగ్రెస్ స‌ర్కార్ కొలువు తీరి నెల రోజులు పూర్త‌యింది. ఈ త‌రుణంలో అరుదైన అవ‌కాశం ద‌క్కింది సీఎం రేవంత్ రెడ్డికి. ఈ మేర‌కు దావోస్ లో ప్రపంచ ఆర్థిక స‌ద‌స్సు జ‌రిగింది. సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్నారు.

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది తెలంగాణ పెవిలియ‌న్ తో ఏర్పాటు చేసిన అలంక‌ర‌ణ‌.

ఇందులో తెలంగాణ ప్ర‌త్యేక‌త‌లు, సంస్కృతిని చాటేలా పొందు ప‌రిచారు. దీనిని అద్భుతంగా తీర్చి దిద్దారు. ప్ర‌స్తుతం ఇది సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.